News October 14, 2024

ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం

image

ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.

Similar News

News October 15, 2024

మాగుంటకు విజయసాయి రెడ్డి విషెస్

image

ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ MP విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఎంపీ మాగుంట అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో TDPలో చేరారు. ఒంగోలు ఎంపీగా విజయాన్ని సైతం అందుకున్నారు. అయితే ఎంపీ మాగుంట పుట్టినరోజు సందర్భంగా విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

News October 15, 2024

ప్రకాశం ఎస్పీకి కీలక బాధ్యతలు

image

సంచలన కేసులను క్లియర్ చేసిన ఘనత ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు ఉంది. గతంలో ఆయన మన జిల్లాలోనే ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలో సవాల్‌గా మారిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనను ఉండి MLA రఘురామకృష్ణ రాజు(RRR) హత్యాయత్నం కేసు దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌ హస్తం ఉందని RRR ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News October 15, 2024

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంతంలో ఉండే ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం పాకల, ఊళ్లపాలెం గ్రామాలలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో ఉండే ప్రజలు వర్షాలకు బయటకు రావద్దన్నారు.