News April 9, 2025

ప్రకాశం జిల్లాలో ముగ్గురు మృతి

image

ప్రకాశం జిల్లాలో వేరు వేరు ఘటనలలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం వల్లూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం, బైక్‌ను ఢీకొట్టడంతో వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టంగుటూరులోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. అర్ధవీడులో మద్యం మత్తులో కన్న తండ్రి, కుమారుడిని కత్తితో పొడవటంతో తీవ్రగాయాలతో షాకీర్ మృతి చెందాడు.

Similar News

News November 9, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.

News November 9, 2025

‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.

News November 9, 2025

మత్స్యకారులకు రూ.72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

image

మంగళగిరిలోని మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి దామచర్ల సత్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పురోగతిని అధికారులు వివరించారన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు 26 బోట్లకు అందించిన రూ.72 లక్షల నష్టపరిహారానికి మారిటైం బోర్డు ఆమోదించిందన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు.