News September 24, 2024
ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 కు సంప్రదించాలన్నారు.
Similar News
News November 2, 2025
వారికి రూ.10,000 బహుమతి: ఎమ్మెల్యే ఉగ్ర

జాతీయ రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు లేదా ఫొటోలు, వీడియో సాక్ష్యాలు అందించిన వారికి రూ.10,000 బహుమతి అందజేస్తామని తెలిపారు.
News November 2, 2025
ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.
News November 1, 2025
నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.


