News September 23, 2024
ప్రకాశం జిల్లాలో మైనింగ్ అధికారుల బదిలీలు
ప్రకాశం జిల్లాలోని ప్రాంతీయ మైనింగ్ విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం నూతనంగా AD సురేశ్ కుమార్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజులను నియమించారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అధికారిని తిరుపతికి బదిలీ చేశారు.
Similar News
News November 26, 2024
IPL వేలంలో ప్రకాశం కుర్రాడికి నిరాశ.!
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన యంగ్ క్రికెటర్ మనీశ్ రెడ్డి ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయ్యారు. జెడ్డాలో రెండ్రోజుల పాటు జరిగిన వేలంలో మనీశ్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా నిరాశే ఎదురైంది. ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి.
News November 25, 2024
విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు: బాలినేని
తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ” YSR మరణించాక మంత్రి, MLA పదవులు వదులుకున్నానన్నారు. చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే నేను మాట్లాడుతున్నానని కొందరు అనడం సమంజసం కాదన్నారు. ఎవరి మెప్పు కోసమో నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. YSR కుటుంబం అంటే ఒక్క జగనేనా.? ఏ షర్మిల, విజయమ్మ కాదా అని బాలినేని ప్రశ్నించారు.
News November 24, 2024
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.