News August 25, 2024

ప్రకాశం జిల్లాలో రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

image

మీ కోసం (ప్రజా ఫిర్యాదుల దినం)ను సోమవారం రద్దు చేసినట్లు కార్యక్రమ జిల్లా సూపరింటెండెంట్ డి నాగజ్యోతి తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అర్జీలతో ఎవ్వరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీకోసం రద్దు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

Similar News

News November 20, 2025

ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

image

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని వాపోయారు. కాగా ఆధార్ సమస్యలపై కామెంట్ చేయండి.

News November 20, 2025

ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి.?

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

News November 20, 2025

ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

image

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని దీంతో అపార్ ఐడీకి పెద్ద చిక్కులు వస్తున్నాయట.