News August 25, 2024
ప్రకాశం జిల్లాలో రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

మీ కోసం (ప్రజా ఫిర్యాదుల దినం)ను సోమవారం రద్దు చేసినట్లు కార్యక్రమ జిల్లా సూపరింటెండెంట్ డి నాగజ్యోతి తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అర్జీలతో ఎవ్వరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీకోసం రద్దు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
Similar News
News January 23, 2026
కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 23, 2026
ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.


