News September 11, 2024
ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
Similar News
News October 15, 2024
ప్రకాశం: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
ప్రకాశం జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు ఎడవల్లి హనుమంతరావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేయబోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ శివరామయ్య వెల్లడించారు.
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం
ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.