News May 27, 2024

ప్రకాశం జిల్లాలో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు

image

జిల్లా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2.14 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అవసరమైన 40వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 1,500 క్వింటాళ్ల కందులు, 5వేల క్వింటాళ్ల మినుములు, 1,200 క్వింటాళ్ల పెసలు ఆర్బీకేల్లో రైతులకు అందబాటులో ఉంచారు.

Similar News

News December 9, 2025

ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

image

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

News December 9, 2025

ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

image

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

News December 9, 2025

ప్రకాశం: రేపటి నుంచి టెట్ పరీక్షలు..!

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 10 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో టెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు, 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.