News March 10, 2025

ప్రకాశం జిల్లాలో సూపర్ ఫొటో..❤

image

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో కొండలను చీల్చుకుంటూ సూర్యుడు ఇలా బయటకు వచ్చాడు. ఇదే సమయంలో కొండలను తాకేలా మేఘాలు రావడంతో చూపరులను కనువిందు చేసింది. అటుగా వెళ్లిన వాళ్లు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు.

Similar News

News April 11, 2026

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు రూ.1.28కోట్లు

image

మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఇటీవల ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.28 కోట్లు విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మందికి రూ.5 లక్షలు, గాయపడిన 29 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు.. మొత్తం రూ.1.28 కోట్లు ఇవ్వనున్నారు.

News April 11, 2026

ప్రకాశం: ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

ఒంగోలులో ఒపెన్ ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. స్థానిక D.R.R.M మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు DEO, క్యాంప్ ఆఫీసర్ P.V రేణుక తెలిపారు. అయితే త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News April 11, 2026

ప్రకాశం: పెన్షన్ ఫ్రాడ్‌లపై SP హెచ్చరిక

image

పెన్షన్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని.. బ్యాంకు అధికారులమని చెప్పి ఓటీపీలు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరూ వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.