News September 21, 2024
ప్రకాశం జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న 14 మంది, పుల్లల చెరువు ఎస్సైను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో గొట్టిపాటి లక్ష్మీ భేటీ
రాష్ట్ర ట్రాన్స్ పోర్టు & స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్శి TDP ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలోని మినీ స్టేడియం ఇతరత్రా అంశాలపై మంత్రికి ఆమె వివరించారు. దర్శికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రిని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం మంత్రికి గౌతమ బుద్ధుడి ప్రతిమ బహూకరించారు.
News October 11, 2024
అద్దంకి: అమ్మవారికి 50 కిలోల లడ్డు సమర్పణ
అద్దంకి పట్టణంలో వేంచేసియున్న శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులలో భాగంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానం 53వ దసరా నవరాత్రులు సందర్భంగా.. 53 కిలోల లడ్డూను అద్దంకి పట్టణానికి చెందిన భక్తులు వూటుకూరి సుబ్బరామయ్య, వారి సోదరులు గురువారం అమ్మవారికి సమర్పించారు.
News October 10, 2024
భైరవకోనలో సినీ నటుడు శ్రీకాంత్
చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనను సినీ నటుడు శ్రీకాంత్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రిముఖ దుర్గాంబిక అమ్మవారిని, శివయ్యను, భైరవేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాంత్‌ను సత్కరించారు.