News October 12, 2024
ప్రకాశం జిల్లాలో 171 దుకాణాలకు 3,416 దరఖాస్తులు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 171 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3,416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఒంగోలులో 34 దుకాణాలకు 590 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా గిద్దలూరులో 13 దుకాణాలకు 231 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.68.32 కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News December 9, 2025
తిరుపతి నుంచి చర్లపల్లికి స్పెషల్ ట్రైన్.. జిల్లాలో స్టాపింగ్ ఇక్కడే!

ప్రకాశంలోని పలు రైల్వేస్టేషన్ల మీదుగా ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం తిరుపతి నుంచి చర్లపల్లి వరకు స్పెషల్ ట్రైన్ (07000) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జిల్లాలోని దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపూర్ రోడ్, దొనకొండ రైల్వే స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుందని, జిల్లా ప్రయాణికులు గమనించాలని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.


