News May 12, 2024
ప్రకాశం జిల్లాలో 18,22,470 మంది ఓటర్లు

రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పరిధిలోని ఒంగోలు లోక్ సభ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో 18,22,470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం జిల్లాలో 2,183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణకు 14,768 మంది ఉద్యోగులను నియమించారు.
Similar News
News February 10, 2025
పాఠశాలలపై అపోహలు వద్దు: మంత్రి స్వామి

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ, హైస్కూల్ కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయితీకి ఒకటి మాత్రమే మోడల్ స్కూల్ ఉంటుందనే అపోహ వద్దన్నారు.
News February 9, 2025
త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు: గొట్టిపాటి

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
News February 9, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు. ఈ రన్‌లో పాల్గొన్న ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.