News September 28, 2024
ప్రకాశం జిల్లాలో 42,033 కౌలు రైతు కార్డులు జారీ

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45వేల కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 42,033 కార్డులను జారీ చేయడం జరిగిందని, కౌలు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు.
Similar News
News October 14, 2025
ఒంగోలు: ఐటీఐలో చేరాలని ఉందా..?

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 5వ విడత ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రసాద్ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈనెల 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 17న ఐటీఐ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
News October 14, 2025
‘ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపుల విక్రయాలు అరికట్టండి’

ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలన్నారు.
News October 14, 2025
ప్రకాశం: ‘ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలి’

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ఏర్పాటుచేసిన గోడ పత్రికను కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతుల పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరవని అన్నారు.