News July 1, 2024

ప్రకాశం జిల్లాలో 93.89% పింఛన్లు పంపిణీ

image

ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సోమవారం సాయంత్రానికి 93.89 శాతం పూర్తి చేసినట్లు జిల్లా స్థాయి అధికారులు తెలిపారు. జిల్లాలో 2,91,524 మంది పింఛన్‌దారులు ఉండగా, 2,73,604 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో కలిసి రాజకీయ నాయకులు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి రేపు పంపిణీ చేయనున్నారన్నారు.

Similar News

News February 23, 2026

వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు అంతా ప్రాముఖ్యత

image

రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక్కటి. ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఫిడర్ కెనాల్ మరమ్మత్తులకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 25న రూ.456కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు మండలాలు సస్యశ్యామలం అవుతాయి.

News February 23, 2026

ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

image

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్‌లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.

News February 23, 2026

మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.