News June 25, 2024

ప్రకాశం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

టీచర్ ఉద్యోగం కలల స్వప్నాన్ని ప్రభుత్వం సాకారం చేసేందుకు సిద్ధమైంది. మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 DSC పోస్టులకు గానూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 124 ఎస్టీటీలతో కలిపి మొత్తం 672 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించనున్నారు.

Similar News

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.

News November 14, 2025