News March 23, 2024
ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
Similar News
News December 8, 2025
ప్రకాశం: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జైలుకే.!

మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ముగ్గురికి న్యాయస్థానం 2రోజుల జైలు శిక్షను సోమవారం విధించింది. దీనిపై ట్రాఫిక్ సీఐ జగదీశ్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
News December 8, 2025
OGL: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

ఒంగోలులో యువతి <<18495938>>ఆత్మహత్యకు <<>>యువకుడి మోసమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కబాడిపాలేనికి చెందిన నళిని(33) ఎంటెక్ చదివింది. మహేంద్ర నగర్కు చెందిన సింగోతు శ్రీనివాస్ ప్రేమ పేరిట దగ్గరై ఆమెను లొంగదీసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెళ్లి కష్టమని చెప్పాడు. దీంతో నళిని పెళ్లి గురించి మాట్లాడటానికి యువకుడి ఇంటికి శనివారం వెళ్లగా వాళ్లు లోపలకు రానివ్వలేదు. మనస్తాపానికి గురైన యువతి ఇంటికొచ్చి ఉరేసుకుంది.
News December 7, 2025
ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.


