News June 19, 2024

ప్రకాశం జిల్లా అధికారులతో మంత్రి మీటింగ్

image

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ కార్యాలయం తెలిపింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, నూతనంగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 8, 2024

ఒంగోలు: బిస్కెట్లతో 18 అడుగుల గణనాథుడు

image

ప్రకాశం జిల్లా ఒంగోలులోని గోరంట్ల బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ 4th లైన్‌లో బిస్కెట్లతో 18 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లగా HMC ‘కమిటీ కుర్రాళ్ళు’ గణేష్ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా బిస్కెట్లతో గణేష్‌ని రూపొందించామని తెలిపారు. దీంతో భక్తులు ఈ గణనాథుని చూసేందుకు తరలి వస్తున్నారు.

News September 8, 2024

ప్రకాశం SP పేరిట చాటింగ్.. సైబర్ నేరగాళ్ల వల

image

ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా జిల్లా SP దామోదర్‌ను టార్గెట్ చేశారు. ఎస్పీ పేరుతో వాట్సప్ DP పెట్టి కొత్త నెంబర్‌తో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ సీఐ వి సూర్యనారాయణకు రూ.50వేలు అర్జెంటుగా కావాలంటూ వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో సామాన్యులు అలర్డ్‌గా ఉండాలన్నారు.

News September 7, 2024

పెద్దారవీడు వద్ద రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న SP

image

పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద వినాయక విగ్రహంతో వెళ్తున్న దేసిరెడ్డిపల్లి <<14041015>>ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది.<<>> ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఆ గ్రామంలో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న SP చలించిపోయారు. దీంతో గ్రామస్థుల్లో బాధను పోగొట్టడానికి ఎస్పీ దామోదర్ స్వయంగా వారితో మాట్లాడి, మరో విగ్రహాన్ని పంపించారు. దీంతో గ్రామంలో తిరిగి ఆనందం నింపారని పలువురు SPని అభినందిస్తున్నారు.