News October 13, 2024
ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News November 12, 2024
ప్రకాశం: ఒకేరోజు ముగ్గురు పోలీసుల మృతి
ప్రకాశం జిల్లాలో సోమవారం విషాద ఘటనలు జరిగాయి. గతంలో నారా భువనేశ్వరికి సపోర్టుగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ <<14584058>>విజయకృష్ణ<<>> గుండెపోటుతో కన్నుమూశారు. మార్కాపురం(M) కొట్టాపల్లికి చెందిన కానిస్టేబుల్ <<14580513>>వేముల మస్తాన్<<>> భార్యతో గొడవపడి ఉరేసుకున్నారు. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చలపతిరావు అనారోగ్యానికి గురయ్యారు. HYDకు తరలిస్తుండగా మేదరమెట్ల వద్ద గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
News November 12, 2024
ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు రూ.444.15 కోట్లు
అసెంబ్లీలో నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.394 కోట్లు కేటాయించారు. అలాగే గుండ్లకమ్మకు సైతం రూ.13 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మొత్తం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రూ.444.15 కోట్లు కేటాయించిందని.. గత ప్రభుత్వం రూ.168.92 కోట్లనే బడ్జెట్‌లో ప్రతిపాదించిందని కూటమి నేతలు అన్నారు.
News November 12, 2024
బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం: ప్రకాశం ఎస్పీ
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాధితులు నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు కోసం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 90 ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి, త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.