News August 25, 2024
ప్రకాశం జిల్లా అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

వచ్చే అయిదేళ్లకు గాను జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు ప్రకాశం భవన్‌లో జిల్లా ఉన్నతాధికారులతో ఆమె శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు, వినూత్నంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్, జడ్పీ సీఈవో మాధురి పాల్గొన్నారు.
Similar News
News January 21, 2026
జనవరి చివరి వారంలో వెలిగొండకు CM.!

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చేయనున్నట్లు వెళ్తున్నారు.
News January 21, 2026
23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.


