News February 9, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు. ఈ రన్లో పాల్గొన్న ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.
Similar News
News September 19, 2025
దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.
News September 19, 2025
తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.
News September 19, 2025
నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.