News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్ను కలిసిన మహిళా ఉద్యోగులు

ఏపీ JAC అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా చైర్ పర్సన్ జయలక్ష్మి గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, వారు పనిచేసే చోట వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయుటకు పట్టణంలో స్థలం కేటాయించవలసిందిగా అర్జీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జయలక్ష్మి తెలిపారు.
Similar News
News December 17, 2025
గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు.
News December 17, 2025
ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రచారం

ఒంగోలులో ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని బస్టాండ్ సమీపంలో హెల్మెట్ ధారణ పాటించిన బైకర్స్కు చాక్లెట్లు అందించారు. పలువురికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు.
News December 17, 2025
ప్రకాశం జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో జేసి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు.


