News June 22, 2024
ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీమ్ అన్సారీయా
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమీమ్ అన్సారియా గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. కొత్త కలెక్టర్ కు జిల్లాలో నీటి ఎద్దడి, కరవు లాంటి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిద్దాం.
Similar News
News November 4, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP సమీక్షా సమావేశాలు
ప్రకాశం జిల్లా రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రేపు ఉదయం మంగళవారం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
News November 4, 2024
ప్రకాశం: ‘ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 74 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరగా ఫిర్యాదు దారులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు.
News November 4, 2024
అద్దంకి: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్నాడు
అద్దంకికి చెందిన ఇంటర్ విద్యార్థి దుర్గాప్రసాద్ (17) గుండ్లకమ్మలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. ఆటోలో పండ్ల వ్యాపారం చేస్తున్న తన తండ్రి ATM నుంచి రూ. 500 బాలుడు డ్రా చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలుడుని అడుగగా మనస్తాపం చెంది, తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతోనే గుండ్లకమ్మలో దూకి ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు.