News March 15, 2025

ప్రకాశం జిల్లా టీచర్‌కు నేషనల్ అవార్డు

image

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News October 27, 2025

ప్రకాశం అధికారులను అలర్ట్ చేసిన సీఎం

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం గురించి, రెవెన్యూ సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.

News October 27, 2025

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

image

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.

News October 27, 2025

తుఫాన్ హెచ్చరిక.. మండలాలకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం!

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముందస్తు చర్యలలో భాగంగా తీర ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను ఆదివారం నియమించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయగా తీర ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీస్ అధికారులను నియమించారు.