News October 24, 2024
ప్రకాశం జిల్లా నూతన డీఈవోగా కిరణ్ కుమార్
ప్రకాశం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌లో విధులు నందు కాగా గురువారం జరిగిన డీఈవోల బదిలీల్లో ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు.
Similar News
News November 10, 2024
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరికే.!
➤కోటా శ్రీనివాసరావు (చాకరాయపాలెం ZPHS)
➤ గోనెళ్ల వరలక్షి (ఈపురుపాలెం ZPHS)
➤ పవని బాను చంద్ర మూర్తి (చీరాల-పేరాల)
➤ మర్రి పిచ్చయ్య (పొదిలికొండపల్లి ZPHS)
➤ SK మజ్ను బీబీ (బసవన్నపాలెం ZPHS)
➤అర్రిబోయిన రాంబాబు (సింగరాయకొండ MPPS)
➤బక్కా హెప్సిబా (K.బిట్రగుంట KGBV)
News November 10, 2024
ప్రకాశం: ‘ఆ SI శ్రమకి ఫలితం దక్కలేదు’
ప్రకాశం జిల్లా ఉలవపాడు SI అంకమ్మ శనివారం ప్రాణాలకు తెగించి ఓ సాహసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో మతిస్థిమితంలేని యువకుడు శనివారం కాలుజారి పడ్డాడు. విషయం తెలుసుకున్న SI అక్కడికి చేరుకున్నారు. తర్వాత తానే స్వయంగా కోనేరులో దూకి యువకున్ని కాపాడే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మృతి చెందాడు.
News November 9, 2024
ప్రకాశం జిల్లా నేతలకు కీలక పదవులు
రెండో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా జీవీరెడ్డి నియమితులయ్యారు. ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్మన్‌గా తేజస్వి పొడపాటి ఎంపికయ్యారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్‌గా మరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్‌కు అవకాశం దక్కింది.