News January 2, 2025
ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు ఇంచార్జ్ ఆర్ఎం ఎవరంటే?
ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్‌ఛార్జ్ రీజనల్ మేనేజర్‌గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణ రావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.
Similar News
News January 21, 2025
కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి(M) శంకరాపురానికి చెందిన దుర్గారావు, చిరంజీవి, ఆమీన్‌లు కామేపల్లి పోలేరమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొండపి JL కోల్డ్ స్టోరేజ్ దగ్గర కట్టెల ట్రాక్టర్ వారి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఆమీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
PM అవార్డ్స్ కోసం ప్రతిపాదనలు పంపండి: ప్రకాశం కలెక్టర్
పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబరు నెలాఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.
News January 21, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక సూచనలు
రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారం, రీ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం ఆయా అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిందన్నారు. ఈ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.