News December 17, 2024

ప్రకాశం: జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష

image

ప్రకాశం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో మంగళవారం ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జీషీట్లు ఏవిధమైన ఆలస్యం లేకుండా ఫైల్ చేయాలన్నారు. అనంతరం కోర్టులో విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 31, 2025

నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

image

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News October 31, 2025

ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

image

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2025

ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

image

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.