News February 10, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 33.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News October 26, 2025

అక్రమాలకు పాల్పడినందుకే సస్పెండ్: ప్రకాశం కలెక్టర్

image

ఆన్లైన్‌లో అక్రమాలకు పాల్పడినందుకే కనిగిరి MROను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, త్వరలోనే పరిష్కార చర్యలు పూర్తిస్థాయిలో ఉంటాయని కలెక్టర్ అన్నారు.

News October 25, 2025

మెుంథా తుఫాన్.. ఈ నెంబర్లు తప్పక గుర్తుంచుకోండి.!

image

మెుంథా తుఫాను నేపథ్యంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే విద్యుత్ శాఖ తరపున 9440817491, కనిగిరి డివిజన్లో 7893208093, మార్కాపురం డివిజన్లో 9985733999, ఒంగోలు డివిజన్లో 9281034437 కంట్రోల్ రూమ్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాద మృతుల్లో ఒంగోలు వాసి.!

image

కర్నూలు వద్ద శుక్రవారం <<18088805>>ఘోర బస్సు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒంగోలుకు చెందిన బొంత ఆదిశేషగిరిరావు ఉన్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులోని కమ్మపాలెం సమీపంలో ఆదిశేషగిరిరావు కుటుంబీకులు నివసిస్తున్నారు. అయితే శేషగిరిరావు బెంగళూరులోని IOC కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా HYD-BLR వెళ్లే క్రమంలో మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు.