News January 7, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO

బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News October 30, 2025
31న ఒంగోలులో జాబ్ మేళా.. జీతం రూ.23 వేలు

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రకటన విడుదల చేశారు. పెద్ద స్థాయిలో కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 10 నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి రూ.14 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం లభించే అవకాశం ఉందని, 18 నుంచి 30 ఏళ్ల వయసు కలవారు పాల్గొనాలని సూచించారు.
News October 30, 2025
కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.
News October 30, 2025
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.


