News January 7, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO

image

బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News January 20, 2025

త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు

image

త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి  గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 20, 2025

ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా

image

ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

News January 20, 2025

సిమ్లాలో పర్యటించిన పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎంపీ మాగుంట

image

గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో‌ ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో‌ నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.