News August 30, 2024

ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా గంధం చంద్రుడు

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఏపీ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను జిల్లాలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 17, 2025

దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

image

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.

News October 17, 2025

వీరయ్య చౌదరి హత్య.. జైలు నుంచి సురేశ్ విడుదల

image

ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ 24న టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు ముప్పా సురేశ్‌ను ఆగస్ట్ 19న అరెస్ట్ చేశారు. ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ ఇచ్చింది. ఆ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి ఆదివారం ఒంగోలు తాలుకా స్టేషన్‌కు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.

News October 17, 2025

ప్రభుత్వాలు మారినా దోపిడీ ఆగడం లేదు..!

image

వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.456కోట్లు ఇవ్వగా త్వరలోనే R&R ప్యాకేజీ విడుదల చేయనుంది. సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలోని 5వేలమందికి ఈ పరిహారం అందనుంది. ఈక్రమంలో కొందరు నాయకులు పరిహారం కావాలంటే ముందుగా రూ.20వేలు ఇవ్వాలని నిర్వాసితుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. గత ప్రభుత్వంలోనూ ఇలాగే నాయకులు దోపిడీ చేయగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎంత అడిగారో కామెంట్ చేయండి.