News August 30, 2024
ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా గంధం చంద్రుడు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఏపీ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను జిల్లాలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News September 14, 2024
కొండపిలో కిలో పొగాకు ధర రూ.358
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలానికి జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగేళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1354 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. అందులో 1009 బేళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 345 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.358, కనిష్ఠ ధర కేజీ రూ.180, సరాసరి ధర రూ.266.88 పలికింది.
News September 14, 2024
ప్రకాశం: YCP రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి నియామకం
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు నియమితులయ్యారు. శుక్రవారం YCP కేంద్ర కార్యాలయంలో YS జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. జిల్లా నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ రావు నియమితులవడంతో జిల్లాలోని పలువురు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
News September 14, 2024
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS
*బాలినేని<<14089340>> పార్టీ మార్పుపై<<>> మరోసారి చర్చ
*అర్ధవీడు: 15 మంది వైసీపీ వర్గీయులపై కేసు
*ఈ నెల 18న దర్శిలో జాబ్ మేళా
*చీరాల:108లో పైలెట్ & డ్రైవర్ ఉద్యోగాలు
*దోర్నాల మాజీ ZPTCపై అవినీతి ఆరోపణలు
*మార్కాపురం: చెరువు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు
* అర్ధవీడు: మైనర్ బాలుడికి మూడేళ్లు జైలు శిక్ష
*యర్రగొండపాలెం వినాయక ఊరేగింపులో ఘర్షణ
* మార్కాపురం: కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న గణేషుడు