News March 12, 2025
ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా కవిత

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 14, 2025
ప్రకాశం: మరో అధికారి సస్పెండ్

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ఓ భూమి విషయంలో జరిగింది. ఇందులో సర్వేయర్ వెంకటేశ్వర రెడ్డి పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే స్థల వివాదంలో తహశీల్దార్ బాల కిషోర్, వీఆర్వోను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సస్పెండ్ అయిన అధికారుల సంఖ్య 3కి చేరింది.
News March 14, 2025
ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News March 14, 2025
సంతోషకర వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి పండుగల సమయంలో యువత ఆదర్శంగా మెలగాలని సూచించారు.