News January 11, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా స్కిల్ అధికారి జె.రవితేజ తెలియజేశారు.12 నెలలు పాటు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 8125215216 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News December 17, 2025
గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు.
News December 17, 2025
ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రచారం

ఒంగోలులో ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం హెల్మెట్ ధారణపై వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని బస్టాండ్ సమీపంలో హెల్మెట్ ధారణ పాటించిన బైకర్స్కు చాక్లెట్లు అందించారు. పలువురికి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు.
News December 17, 2025
ప్రకాశం జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: జేసీ

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో జేసి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు.


