News April 30, 2024

ప్రకాశం జిల్లా రాజకీయ వేడి పులుముకుంది

image

ప్రకాశం జిల్లాలో ఇవాళ నారా లోకేశ్ ఒంగోలు, పవన్ కళ్యాణ్ గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సీఎం జగన్ కొండపి, నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో అభ్యర్థులు జనసమీకరణలు చేస్తున్నారు. ఇక పోలీసులు వీరి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను రెట్టింపు చేశారు. ఒకేసారి జిల్లాకు నలుగురు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పులుముకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News September 30, 2024

చంద్రబాబు, పవన్ ముక్కు నేలకు రాయాలి: తాటిపర్తి

image

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవమానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు, రాష్ట్ర, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని Xలో పోస్ట్ చేశారు.

News September 30, 2024

ప్రకాశం: పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు విడుదల

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య?

image

పామూరులోని 565 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాళ్లతో కట్టి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని కరెంటు కాలనీకి చెందిన సిద్ధవటం వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తున్నారు.