News December 11, 2024
ప్రకాశం జిల్లా రైతులకు గమనిక

ప్రకాశం జిల్లాలో కంది సాగు చేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వమే కందులు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!