News August 13, 2024
ప్రకాశం జిల్లా రైతులకు ముఖ్య గమనిక

జిల్లాలో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులు ఈ-క్రాప్ యాప్‌లో నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు, కౌలు రైతులు ఈ-పంట దరఖాస్తు ఫారం పూర్తి చేసి, వారి పొలం పూర్తి వివరాలు నమోదు చేసి గ్రామ వ్యవసాయ సహాయకులతో నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 5, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.
News November 5, 2025
ప్రకాశం: సముద్ర స్నానానికి వస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ☛ పోలీసుల సూచనలు పాటించాలి☛ తీరం లోపలికి పోకుండా.. నిర్దిష్ట ప్రదేశంలో స్నానాలను ఆచరించాలి☛ అలల ఉధృతి సమయంలో జాగ్రత్త వహించాలి☛ చిన్నారులను తీరం లోపలికి తీసుకువెళ్లకపోవడమే మంచిది☛ విలువైన వస్తువులను జాగ్రత్తపరచుకోవాలి☛ వాతావరణం ప్రతికూలంగా ఉంటే మరింత జాగ్రత్త అవసరం
News November 4, 2025