News April 3, 2025
ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

ప్రకాశం జిల్లాలో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో చెట్లకింద నిలబడరాదని సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.
News November 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.
News November 3, 2025
టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

టంగుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.


