News October 18, 2024

ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త చెప్పిన దామచర్ల

image

ప్రకాశం జిల్లా వాసులకు దామచర్ల జనార్దన్ శుభవార్త చెప్పారు. 2014-19 మధ్య TDP ప్రభుత్వంలో ఎందరో పక్కా ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. కాగా చాలావరకు అప్పుడు నిర్మించుకున్న ఇళ్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. త్వరలోనే ఆ బిల్లులను చెల్లిస్తామని దామచర్ల జనార్దన్ ఓ కార్యక్రమంలో హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల వివరాలను సేకరించి త్వరలోనే బిల్లులు మంజూరు చేస్తామన్నారు.

Similar News

News November 22, 2025

రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

image

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.

News November 22, 2025

ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్‌ను సంప్రదించాలన్నారు.