News December 11, 2024

ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో ఇవాళ జగన్ భేటీ

image

వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఇవాళ భేటీ కానున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్‌ పర్సన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ఓటమి, బాలినేని పార్టీ వీడటం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Similar News

News November 20, 2025

ప్రకాశం: నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

సాగర్ కవచ్‌కు 112 మంది పోలీసుల కేటాయింపు

image

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్‌ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.