News May 22, 2024
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది బైండోవర్

ఎన్నికల సందర్భంగా జిల్లాలో 26 వేల మందిని ముందస్తు బైండోవర్ చేశామని ఎస్పీ సునీల్ తెలిపారు. గొడవలు సృష్టించిన 35 మంది వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. వారిపై చర్యలకు అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. మారణాయుధాలతో పాటు.. విడిగా పెట్రోలు కలిగివున్నా రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు తీసుకొని నిర్వహించుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News September 18, 2025
ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.