News August 6, 2024
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

➤ ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందనలు➤ ప్రకాశం జిల్లాలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్➤ టూలేట్ బోర్డు చూసి.. ఇంట్లోకి వచ్చి దాడి➤ సచివాలయ సెక్రటేరియట్‌పై దాడి ➤ అద్దంకిలో రాగి తీగ దొంగలు అరెస్టు➤ శ్రీశైలం డ్యాం అందాలను చూద్దాం రండి➤ అద్దంకి: మా పిల్లలు తప్పు చేయలేదు➤ త్వరలో మార్కాపురాన్ని జిల్లా చేస్తాం: ఎమ్మెల్యే కందుల➤ నాటి చరిత్రకు సాక్ష్యంగా వేటపాలెం గ్రంథాలయం
Similar News
News October 21, 2025
ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్‌రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్‌వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.
News October 21, 2025
నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.
News October 20, 2025
నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.