News September 14, 2024
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

*బాలినేని<<14089340>> పార్టీ మార్పుపై<<>> మరోసారి చర్చ
*అర్ధవీడు: 15 మంది వైసీపీ వర్గీయులపై కేసు
*ఈ నెల 18న దర్శిలో జాబ్ మేళా
*చీరాల:108లో పైలెట్ & డ్రైవర్ ఉద్యోగాలు
*దోర్నాల మాజీ ZPTCపై అవినీతి ఆరోపణలు
*మార్కాపురం: చెరువు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు
* అర్ధవీడు: మైనర్ బాలుడికి మూడేళ్లు జైలు శిక్ష
*యర్రగొండపాలెం వినాయక ఊరేగింపులో ఘర్షణ
* మార్కాపురం: కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న గణేషుడు
Similar News
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాద మృతుల్లో ఒంగోలు వాసి.!

కర్నూలు వద్ద శుక్రవారం <<18088805>>ఘోర బస్సు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒంగోలుకు చెందిన బొంత ఆదిశేషగిరిరావు ఉన్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులోని కమ్మపాలెం సమీపంలో ఆదిశేషగిరిరావు కుటుంబీకులు నివసిస్తున్నారు. అయితే శేషగిరిరావు బెంగళూరులోని IOC కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా HYD-BLR వెళ్లే క్రమంలో మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు.
News October 25, 2025
కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.
News October 25, 2025
కర్నూలు ఎఫెక్ట్.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులకు హడల్..!

కర్నూల్‌లో ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నేషనల్ హైవేలలో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్ బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సాగాయి.


