News December 20, 2024
ప్రకాశం: జ్వరాలతో తల్లడిల్లుతున్న రామాయపాలెం
మర్రిపూడి మండలం రామాయపాలెంలో కొద్దిరోజులుగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్యం అందక గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ గ్రామం నుంచి 10 మందికి పైగా ఒంగోలులోని కార్పొరేట్ వైద్యశాలల్లో చేరారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని కొందరు గ్రామంలోనే RMPలచే వైద్యం చేయించుకుంటున్నారు. గురువారం మరికొందరు ఒంగోలు ఆసుపత్రులకు వెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి
కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News January 18, 2025
ప్రకాశం: 20వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలు
ప్రకాశం జిల్లాలోని ప్రతి గ్రామంలో జనవరి 20వ తేదీ నుండి 31 వరకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శిబిరాలలో పశువులకు, దూడలకు, గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని పశువులకు గొంతువాపు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.
News January 18, 2025
ప్రకాశం: ఒకే రోజు జిల్లాలో నలుగురు మృతి
వివిధ కారణాలతో ఒకేరోజు జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. మార్కాపురం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నారాయణ మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, కనిగిరికి చెందిన అనంతమ్మ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రహదారి ప్రమాదంలో ప్రతాప్ మృతిచెందగా, కురిచేడులో యశ్వంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.