News October 24, 2024
ప్రకాశం: టీడీపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

ప్రకాశం జిల్లాలో మరో నేత YCPకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సచివాలయంలో బుధవారం చీరాల మాజీ MLA కరణం బలరాం CM చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు MLA దామచర్ల ఉన్నారు. ఈయన 2019లో చీరాల నుంచి TDP తరఫున MLAగా గెలిచి YCPలో చేరారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేశ్ YCP నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
Similar News
News November 26, 2025
నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: ప్రకాశం కలెక్టర్

ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టు పరిధిలో అవినీతి కార్యకలాపాలకు పలువురు సిబ్బంది పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ప్రాజెక్టు పరిధిలో జరిగిన అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.


