News June 5, 2024

ప్రకాశం: టీడీపీ ఓటమి.. కార్యకర్తకు గుండెపోటు

image

యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో టీడీపీ కార్యకర్త దర్శనం దేవయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కష్టపడి పనిచేసిన ఎరిక్షన్ బాబు ఓటమిని దేవయ్య జీర్ణించుకోలేక పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేవయ్యకు పలువురు టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.

Similar News

News December 10, 2024

విద్యుత్ వాహనాల పెంపుపై మాగుంట ప్రశ్న

image

దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలు, కేటాయించిన నిధులపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిస్తూ గత ఐదేళ్లలో 1,68,263 వాణిజ్య, మూడు చక్రాల, రెండు చక్రాల విద్యుత్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో 257 తయారీ యూనిట్లు ఉండగా రాష్ట్రంలో నాలుగు ఉన్నాయని వివరణ ఇచ్చారు.

News December 10, 2024

పొదిలిలో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

image

పొదిలి అడ్డరోడ్డు సమీపంలోఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళ వారం ఎన్ఫోర్స్‌మెంట్ ఆర్డీవో, ఆర్‌ఐ, వీఆర్‌వో కలిసి అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడ నుంచి తెచ్చారు, ఎన్నిరోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News December 10, 2024

జమ్మూలో కంభం ఆర్మీ జవాన్ మృతి

image

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సోమవారం జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందాడు. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పని చేస్తున్న వరికుంట్ల వెంకట సుబ్బయ్య అనే జవాన్ జమ్మూ కశ్మీర్‌లో వీధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి వీర మరణం పొందాడు. కాగా ప్రస్తుతం అతని మృతదేహాన్ని రాజా సుఖదేవ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌కు తరలించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సిఉంది.