News September 28, 2024

ప్రకాశం: టెట్ నిర్వహణకు నాలుగు కేంద్రాల ఎంపిక

image

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ కోసం జిల్లాలో కేంద్రాలను ఎంపిక చేసినట్లు DEO సుభద్ర పేర్కొన్నారు. అక్టోబర్ 3&21 వరకు ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. (1)పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణచైతన్య విద్యాసంస్థ, (2) మార్కాపురం మండలం దరిమడుగులోని జార్జి కళాశాల, (3) ఒంగోలులో నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చి సంస్థ, బ్రిలియంట్స్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News November 25, 2025

ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

image

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.

News November 24, 2025

ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.