News October 5, 2024

ప్రకాశం: టెట్‌ పరీక్షలకు 63 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు రెండో రోజు శుక్రవారం పరీక్షలకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభధ్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. సాయంత్రం సెషన్‌లో మాత్రమే ఈ పరీక్షలు జరగ్గా, 520 మందికి గానూ 457 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో తెలిపారు.

Similar News

News February 7, 2026

ప్రకాశం: పొగాకు బోర్డు అధికారి ట్రాన్స్‌ఫర్

image

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్‌ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.

News February 7, 2026

మార్కాపురం: కోరిక తీర్చలేదని చంపేశాడు..!

image

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.

News February 7, 2026

సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

image

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.