News February 12, 2025
ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

మార్కాపురం డివిజన్లో 57, ప్రకాశం డివిజన్లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 7, 2025
ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.
News December 7, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన.!

ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.
News December 7, 2025
సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.


