News February 10, 2025
ప్రకాశం: తండ్రిని చంపిన కొడుకు.. BIG UPDATE

దొనకొండ(M) ఇండ్లచెరువులో <<15406169>>తండ్రిని కొడుకు హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన మరియదాసు రోజూ ఇంట్లో గొడవ పడేవాడు. వారం కిందట భార్య, పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. శనివారం తండ్రి వద్ద డబ్బులు తీసుకుని మరియదాసు తాగి రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఏసు ఇంటికి తెచ్చాడు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి రంపం బ్లేడుతో నిద్రలో ఉన్న తండ్రిని హత్యచేశాడు.
Similar News
News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
News March 28, 2025
కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2025
ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.