News December 20, 2024
ప్రకాశం: ‘తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు’

పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సీవియన్ రీడింగ్ రూమ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా APSFL కేబుల్ ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.కేబుల్ ఆపరేటర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు.
Similar News
News November 3, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు SP కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు ఆదివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాల్లో మన అప్రమత్తతే మనకు రక్షని సూచించారు.
News November 2, 2025

వారికి రూ.10,000 బహుమతి: ఎమ్మెల్యే ఉగ్ర

జాతీయ రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు లేదా ఫొటోలు, వీడియో సాక్ష్యాలు అందించిన వారికి రూ.10,000 బహుమతి అందజేస్తామని తెలిపారు.